- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ లో 'ఠాగూర్' సీన్
దిశ, వెబ్ డెస్క్ : శవానికి ట్రీట్మెంట్ ఇస్తూ మరిన్ని డబ్బులు వసూలు చేసే ఠాగూర్ సినిమాలోని సన్నివేశం లాంటిది గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ లో నిజంగానే జరిగింది. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లాకు చెందిన వెంకటేష్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. కొద్ది రోజుల కింద గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్ లో జాయిన్ అవగా.. సర్జరీ కోసమని ఐదున్నర లక్షలు కట్టించుకున్నారు. శుక్రవారం సర్జరీ చేస్తామని తెలిపిన వైద్యులు గురువారం నుండి వెంకటేష్ ను చూడటానికి అనుమతించలేదు. ఎంత బతిమాలినా పేషెంట్ ను చూపించకపోగా.. ట్రీట్మెంట్ కు మరో నాలుగు లక్షలు కట్టాలని, అప్పుడే చూసేందుకు అనుమతిస్తామని తెలిపారు. దీంతో ఏదో జరుగుతుందని భయపడిన బంధువులు ఐసియూ అద్దాలు పగులగొట్టి చూడగా అప్పటికే వెంకటేష్ మృతి చెంది ఉండటంతో ఖంగు తిన్నారు. ఆగ్రహంతో హాస్పిటల్ బయట ఆందోళనకు దిగి, డబ్బుల కోసం శవానికి ట్రీట్మెంట్ నాటకం ఆడారని యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. అయితే ఈ ఘటనపై ఇరు పక్షాల నుండి ఎవరూ కేసు నమోదుకు ముందుకు రాకపోవడం కొసమెరుపు.