- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాళేశ్వరం నేను డిజైన్ చేయలే.. KCR వ్యాఖ్యలకు T-కాంగ్రెస్ అదిరిపోయే కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్‌గా కేసీఆర్ మారడంతోనే ఆ ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని తరచూ వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ తాజాగా స్పందించారు. ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన మంగళవారం మాట్లాడారు. తాను ఇంజినీర్ గ్యాడ్యూవేట్ కాదని.. తనకు ఇంజినీర్ భాషే రాదన్నారు. తాము స్ట్రాటజీ మాత్రమే ఇస్తామన్నారు. రాజకీయ నాయకులు స్ట్రాటజీస్ట్‌లే కానీ డిజైన్ చేయరు అని తేల్చి చెప్పారు. ఇక, ఇదే అంశంపై టీ- కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసింది.
‘లక్ష కోట్ల అవినీతి స్ట్రాటజీ : కేసీఆర్‌ను మాయల మరాఠీ అని ఊరికే అనలేదు. ప్రాజెక్టును కట్టి ప్రపంచంలోనే ఇలాంటి అద్భుతమైన కట్టడం లేదని, కేసీఆర్ మెదడు మొత్తం కరిగించి ప్రాజెక్టు కట్టిండని ప్రచారం చేసుకున్నారు. కేసీఆర్ కాదు కాళేశ్వర్ రావు అని ప్రచారం చేశారు. మరొకాయనేమో ప్రపంచంలోనే దీనంత అద్భుతమైన కట్టడం లేదని ప్రగల్బాలు పలికాడు. తీరా చూస్తే అది వర్షాలకు మునిగిపోయింది. ఒక్క వరదకే కుంగిపోయింది. కేసీఆర్ ఇపుడు తన తప్పుని అధికారుల మీదకి నెట్టేసి, తెలంగాణ ప్రజలని మళ్లీ మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.
ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్‌కు కట్టబెట్టింది బీఆర్ఎస్. మేఘా ఇంజనీరింగ్ నుండి ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా లబ్ధి పొందింది బీఆర్ఎస్. లక్ష కోట్ల అవినీతి జరిగిందని బయటపడేసరికి, ఇప్పుడు స్ట్రాటజిస్టు అని కొత్త కొత్త పదాలు పుట్టిస్తున్నాడు. నీ పిట్టల దొర మాటలకు నూకలు చెల్లినయ్.. తెలంగాణ ప్రజలే నిన్ను ఛీ కొట్టి దూరం పెట్టారు. ఇకనైనా కుట్రలు మాని రెస్ట్ తీసుకో కేసిఆర్.’ అని టీ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.