- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MP కోమటిరెడ్డి అభిప్రాయం కీలకం.. రాష్ట్ర నాయకత్వానికి ప్రియాంక సూచన!
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా మిగతా పార్టీల కంటే ముందే రంగంలోకి నియోజకవర్గంలోని చండూరులో భారీ బహిరంగ సభ సైతం ఏర్పాటు చేసి, కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పార్టీ కీలక నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేధాలు తొలగిపోయి, అభ్యర్థి విషయమై చర్చించడానికి ఢిల్లీ వేదికగా ప్రియాంక గాంధీతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మునుగోడు బైపోల్‌లో వ్యవహరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలు, అభ్యర్థి విషయంలో ప్రియాంకా గాంధీ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా అభ్యర్థిని సైతం ఖరారు చేయాలని రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు సమాచారం. అంతేగాక, అభ్యర్థి ఎంపిక విషయంలో స్థానిక ఎంపీ, టీపీసీసీ స్టార్ క్యాంపెయిన్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ్టి(ఆగస్టు 23) నుంచి అభ్యర్థి విషయమై పార్టీ కీలక నేతలతో సంప్రదింపులు చేయనున్నారు.