- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్ల కోసం BJP రూ.6 వేల కోట్లు ఖర్చు చేసింది.. కుండబద్దలు కొట్టిన Revanth Reddy
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను బీజేపీ తన ఫ్రంటల్ఆర్గనైజేషన్తరహాలో ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు. రాహుల్‌గాంధీ యాత్ర నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జనరల్‌సెక్రెటరీ కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల పీసీసీలు, జనరల్సెక్రెటరీలతో సోమవారం ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే నెల 4న ఢిల్లీలో ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. నిరుద్యోగ సమస్య, అధిక ధరలు, అవినీతి డబ్బుతో ప్రభుత్వాలను కూలదోసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఈ ఆందోళన చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రాంతీయ పార్టీలను పడగొట్టేందుకు బీజేపీ రూ.6 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలుస్తున్నదని, ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన పార్టీలను, ప్రభుత్వాలను నాశనం చేయాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. దేశాన్ని ఏకం చేయడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ బృహత్తరమైన కార్యక్రమం చేపట్టారన్నారు. 150 రోజులు నిరంతరం 25 కిలో మీటర్ల చొప్పున మారుమూల గ్రామాలు, తండాల్లో ఆయన పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు. ప్రజలంతా మద్దతు తెలపాలని కోరారు. అభివృద్ధే ఎజెండాగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని, పార్టీ ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్‌గా మారారని విమర్శించారు.