Congress Manifesto : గల్ఫ్ కార్మికులకు T-కాంగ్రెస్ కీలక హామీ..

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-17 08:46:15.0  )
Congress Manifesto : గల్ఫ్ కార్మికులకు T-కాంగ్రెస్ కీలక హామీ..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల వేళ టీ- కాంగ్రెస్ శుక్రవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. అన్ని వర్గాల సంక్షేమానికి తాము పెద్ద పీట వేయనున్నట్లు మేనిఫెస్టో ద్వారా కాంగ్రెస్ భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. గల్ఫ్ కార్మికుల కోసం టీ-కాంగ్రెస్ సంచలన హామీలను మేనిఫెస్టోలో ప్రకటించింది. ఎన్నారైల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపింది. గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో తెలిపింది. మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని తెలిపింది. విదేశాలలో ఉన్న వలస కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది.

---->> కాంగ్రెస్ మేనిఫెస్టోలోని పూర్తి అంశాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Advertisement

Next Story

Most Viewed