బ్రేకింగ్: టీ- కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలకు ముహూర్తం ఫిక్స్..!

by Satheesh |   ( Updated:2023-10-13 14:37:54.0  )
బ్రేకింగ్: టీ- కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలకు ముహూర్తం ఫిక్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఒకేసారి ప్రకటిస్తామని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం మురళీధరన్ మీడియాతో మాట్లాడారు. 60 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేశామని.. మిగిలిన స్థానాల్లో త్వరలోనే క్యాండిడేట్ల పేర్లు ఫిక్స్ చేస్తామని తెలిపారు. వామపక్షాలతో పొత్తులపై రేపు నిర్ణయం తీసుకుంటామని.. పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వారితో చర్చలు జరుపుతారని పేర్కొన్నారు.

చర్చల అనంతరం స్క్రీనింగ్ కమిటీ భేటీ అయిన తర్వాత పొత్తులపై నిర్ణయం వెల్లడిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న బస్సుయాత్రకు ముందే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఈ నెల 15వ తేదీ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. అభ్యర్థుల ఎంపికలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇక, పొన్నాల రాజీనామాపై స్పందిస్తూ.. రాజీనామాలపై రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు.. పార్టీలోకి చాలా మంది వచ్చి చేరుతున్నారని అన్నారు.

Advertisement

Next Story