T Congress: ఇకనైనా బురద రాజకీయాలు మానండి.. బీఆర్ఎస్ ట్వీట్‌కు కాంగ్రెస్ కౌంటర్

by Ramesh Goud |
T Congress: ఇకనైనా బురద రాజకీయాలు మానండి.. బీఆర్ఎస్ ట్వీట్‌కు కాంగ్రెస్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దొరల పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని, కేసీఆర్(KCR) పాలనలో అధికారులు నాయకుల చేతిలో కీలు బొమ్మలా మారి అవినీతిని లీగల్ చేశారని కాంగ్రెస్(Telangnana Congress) పార్టీ ట్వీట్ చేసింది. "తెలంగాణలో హోం మినిస్టర్(Home Minister) మిస్సింగ్" అంటూ బీఆర్ఎస్ పార్టీ(BRS Party) చేసిన ట్వీట్(Tweet) కు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్.. గత బీఆర్ఎస్ పాలనపై విమర్శల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా.. పదేళ్ల దొరల పాలనలో ప్రజలు తమ సమస్యను చెప్పోకోవాలంటే భయపడే స్థితి ఉండేదని, నోరు విప్పకుండా వారిని భయ బ్రాంతులకి గురి చేశారని మండిపడింది. కానీ ప్రజా పాలనలో ప్రజలు గొంతు విప్పి వారి భాధలు చెప్పుకునేందుకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని రక్షిస్తూ ప్రభుత్వం వారికి అవకాశాలు కల్పిస్తుందని, మీ హయంలో మంత్రులు ప్రజలకు అందనంత దూరంలో ఫాం హౌస్ లో జల్సాలు చేసేవారని, కేవలం దొరల కోసం పనిచేసే వారని దుయ్యబట్టింది.

ఇక ప్రజా ప్రభుత్వంలో మంత్రులు సచివాలయంలో, నియోజకవర్గాల్లో, ప్రజల్లో ఉంటూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, ఉద్యమ ఆకాంక్షల కోసం పని చేస్తున్నారని తెలిపింది. బీఆర్ఎస్ నాయకుల మాయల పకీరు మాటలు నమ్మి కొంత మంది అవగాహన లేక చేస్తున్న ధర్నాలు కొన్ని అయితే, పదేళ్ల మీ ప్రభుత్వ హయంలో మోసపోయిన ప్రజలు నేడు ప్రజా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తూ నిరసన తెలుపున్న వారు మరి కొంతమంది అంటూ.. దీనికే లా అండ్ ఆర్డర్(Law And Order) తప్పింది అని గగ్గోలు పెడుతున్నారని వ్యాఖ్యానించింది. మీరు పాపాలు చేసి, ఆ పాపాలను కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలని చూస్తున్నారని, మీ ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని సంఘటనలు, లా అండ్ ఆర్డర్ పరిస్థితి, ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పింది. పదేళ్ళలో జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయని, ఇకనైనా బురద రాజకీయాలు మాని, చిల్లర విమర్శలు కాకుండా, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కాంగ్రెస్ సూచించింది.

Advertisement

Next Story