- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ఓ బంకింగ్ మాస్టర్.. సీఎంపై బండి సంజయ్ సెటైర్లు
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి మండిపడ్డారు. కేసీఆర్ సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. నీతి ఆయోగ్ సమావేశంతో పాటు అనేక కార్యక్రమాలకు ఆయన బంక్ కొడుతున్నాడని ధ్వజమెత్తారు. ప్రధాన మంత్రి కార్యక్రమాలు, రాష్ట్రపతి విందు, రాజ్ భవన్‌లో రిపబ్లిక్ డే ఉత్సవాలకు, సదరన్ జోనల్ కౌన్సిల్ వంటి కార్యక్రమాలకున్నింటికి గైర్హాజరు అవుతూ ఓ బంకింగ్ మాస్టర్‌గా అవతరించారని సెటైర్లు వేశారు.
చివరకు ప్రజలకు సైతం కలవకుండా తప్పించుకుంటున్నాడని దుయ్యబట్టారు. అధికారిక కార్యక్రమాలన్నింటికీ దూరంగా ఉంటున్న కేసీఆర్ ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంబోత్సవానికి సైతం బంక్ కొట్టబోతున్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి సమాఖ్య స్ఫూర్తి అంటే లెక్కలేదని అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పదే పదే అవమానపరిచే విధంగా సీఎం తీరు ఉందని విమర్శించారు.
Also Read...
‘మాకు నీతులు చెప్పకు’’.. సీఎంకు మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్