- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భయపెడుతున్న బైపాస్ రోడ్డు.. కలవర పడుతున్న ప్రజలు
దిశ, కొత్తగూడెం రూరల్: హేమ చంద్రాపురం ప్రాంతంలో అనేక కుటుంబాలు నివాసం ఉంటాయి. ఈ కుటుంబాలకు పక్కనే ఉన్న ప్రధాన రహదారి వారికి శాపంగా మారింది. భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో రోడ్డు నుంచి వెలువడుతున్న దుమ్ము ధూళి వల్ల ప్రజలు సతమతమవుతున్నారు. ఈ సమస్య గత కొన్ని నెలలుగా ఉన్నప్పటికీ పట్టించుకునే వారే లేరు. అంతేకాకుండా రహదారి ప్రమాదకరంగా మారడంతో ప్రమాదాలతో పాటు మరణించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలో ఉన్న హేమచంద్రాపురం బైపాస్ రోడ్ ప్రమాదకరంగా మారింది. భారీ వాహనాలతో పాటు బొగ్గు లోడింగ్‌తో ఉన్న టిప్పర్లు ఈ బైపాస్ రోడ్డు మీద నుంచి ప్రతిరోజు రాకపోకలు జరుగుతుంటాయి. అయితే గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలతో బైపాస్ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. పెద్ద పెద్ద గుంటలు ఏర్పడటంతో పాటు రోడ్డు అంచులు కోతకు గురయ్యాయి.
ఆదమరిస్తే ప్రమాదం జరగడంతో పాటు ప్రాణాలు పోయే అవకాశాలు లేకపోలేదు. బైపాస్ రోడ్డు మీద నుంచి అధిక లోడుతో వాహనాలు వెళుతున్న సమయంలో గుంతల నుంచి వెలువడుతున్న దుమ్ము పక్కనే ఉన్న ఇండ్లపై పడటంతో పాటు కొంతమంది చర్మవ్యాధులకు సైతం గురవుతున్నట్లు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధ్వానంగా మారిన బైపాస్ రోడ్డుకు మరమ్మత్తులు నిర్వహించాలని గతంలో రహదారి పక్కన నివాసం ఉంటున్న పలు కుటుంబాలు నిరసన తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రతిరోజు రహదారి పక్కనున్న కుటుంబాలు బైపాస్ రోడ్డు నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల సతమతం అవుతున్నారు.
ప్రమాదాలు జరిగితేనే స్పందిస్తారా..?
భయాందోళన కలిగిస్తున్న హేమ చంద్రాపురం బైపాస్ రోడ్డు మరమ్మతులు నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంపై పక్కనే ఉన్న నివాస కుటుంబాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతే స్పందిస్తారా..? అంటూ అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఇబ్బందులను ద్విచక్ర వాహనదారుల అవస్థలను గమనించి బైపాస్ రోడ్డుకు తక్షణమే మరమ్మత్తులు నిర్వహించి రోడ్డుతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు
త్వరలోనే పనులు మొదలు
హేమచంద్ర పురం బైపాస్ రోడ్డు మరమ్మతుల కోసం టెండర్లను పిలిచాం. కొద్దిరోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. సమస్య పరిష్కారిస్తాం.-రాజశేఖర్, సింగరేణి కార్పొరేట్ డీజీఎం సివిల్