- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్కు మళ్లీ సింబల్ టెన్షన్! ప్రతీసారీ ఇదే తలనొప్పి
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో గత అసెంబ్లీ, ఉప ఎన్నికల్లో మాదిరిగానే బీఆర్ఎస్ పార్టీకి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎన్నికల గుర్తులతో టెన్షన్ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ అధికార గుర్తు కారు. అయితే దీన్ని పోలిన గుర్తులు ఉన్నాయని బీఆర్ఎస్ భావిస్తోంది. రోడ్ రోలర్, రోటీ మేకర్ లాంటి గుర్తులతో బీఆర్ఎస్‌కు గుబలు పుడుతోంది. బీఆర్ఎస్‌కు పడాల్సిన ఓట్లు ఈ గుర్తలకు పడుతున్నాయని పార్టీ ఆందోళనకు చెందుతోంది. నవంబర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తమ 'కారు' గుర్తును పోలిన గుర్తులను కేటాయించడంపై ఆందోళనకు దిగిన బీఆర్‌ఎస్ మళ్లీ ఆందోళన చెందుతోంది.
రోడ్ రోలర్ & రోటీ మేకర్‌లతో గుబులు
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో యుగ తులసి పార్టీ అభ్యర్థి కె. శివ కుమార్‌కు ఈవీఎం బ్యాలెట్ యూనిట్‌లో 5 నంబర్ ఉన్న రోడ్‌రోలర్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఈవీఎం బ్యాలెట్ యూనిట్‌లో 4గా ఉన్న కారు గుర్తును ఉపయోగించి బీఆర్‌ఎస్ అభ్యర్థి టి పద్మారావు గౌడ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మే 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి దండెం రత్నంకు రోడ్‌రోలర్ గుర్తు లభించగా, నివేదిత సాయన్న కారు గుర్తుతో బీఆర్‌ఎస్ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ లోక్‌సభ రేసులో స్వతంత్ర అభ్యర్థికి రోటీ మేకర్ గుర్తును కేటాయించారు.
మరిన్నీ గుర్తులు
ఈవీఎంలలో తన కారు గుర్తును తప్పుగా భావించే గుర్తులను కేటాయించకుండా ఉండాలంటూ బీఆర్ఎస్ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఇది కెమెరా, చపాతీ రోలర్, రోడ్ రోలర్, సోప్ డిష్, టెలివిజన్, కుట్టు యంత్రం, ఓడ, ఆటోరిక్షా, ట్రక్ వంటి చిహ్నాలను సమస్యాత్మక మైనవిగా పార్టీ జాబితా చేసింది. వీటి ద్వారా తమ పార్టీ ఓట్లు చీలే అవకాశం ఉన్నట్లు అధిష్టానం భావిస్తోంది.
ప్రతీసారీ పార్టీకి ఇదే తలనొప్పి
గతంలో దీని గురించి బీఆర్ఎస్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. అయితే ఎన్నికల ముందు వెళ్ళడంతో కోర్టు ఈ పిటిషన్లను కొట్టేసింది. ఇప్పటివరకు ఏం చేస్తున్నారంటూ చివాట్లు కూడా పెట్టింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో యుగతులసి పార్టీ అభ్యర్థి పోటీ చేయకుండా బీఆర్ఎస్ చీఫ్ పావులు కదిపారు. అవి పలించి అప్పుడు ఆ పార్టీ అసలు పోటీలోనే ఉండకుండా విత్‌డ్రా అయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేనట్లు తెలుస్తోంది.