- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఢిల్లీకి వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించిన CM రేవంత్.. సోనియా రాకపై వీడని సస్పెన్స్..?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆవిర్భావ సెలబ్రేషన్స్‌కు కాంగ్రెస్ అగ్ర నాయకురాలిని తీసుకువచ్చేందుకు ఆ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. గత కొన్ని రోజులుగా ఫోన్లలోనే సంప్రదింపులు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంగళవారం నేరుగా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని ఆహ్వానించారు. ఆమె తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు వచ్చేందుకు సానుకూలంగా ఉన్నారని సీఎం స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంతోషం వ్యక్తం అవుతున్నది. పరేడ్ గ్రౌండ్ సభ వేదికపై తెలంగాణ ప్రజల పక్షాన సోనియా గాంధీకి భారీ సన్మానాలు చేయాలని పార్టీ ఆలోచిస్తున్నది. రాష్ట్ర సాంస్కృతిక కళలు, నృత్యాలతో వెల్ కమ్ చెప్పడంతో పాటు, హర్షద్వనుల మధ్య స్వాగతం పలకాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం పార్టీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో రిహార్సల్స్ కూడా చేస్తున్నట్లు తెలిసింది.
కానీ సోనియా గాంధీ తన ఆరోగ్య పరిస్థితులు దృష్ట్యా తెలంగాణకు రాని పక్షంలో ప్రజల కోసం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విడుదల చేసినట్లే, తెలంగాణ ప్రజల కు ఆవిర్భావ శుభాకాంక్షలు చెబుతూ రిలీజ్ చేయనున్నారు. తెలంగాణ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత, అప్పుడు కాంగ్రెస్ తీసుకున్న కీలక నిర్ణయాలు, రాష్ట్రంలో అమలవుతున్న ఆరు గ్యారంటీలు వంటి అంశాలపై సోనియా ఈ వీడియోలో చెప్పే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. మరోవైపు ఈ సెలబ్రేషన్స్‌కు రాహుల్ గాంధీ హాజరూ కూడా అనుమానంగానే ఉన్నట్లు తెలుస్తోన్నది. సోనియా, రాహుల్, ప్రియాంకలను ముగ్గురినీ పార్టీ ఆహ్వానించింది. చివరి నిమిషం వరకు రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు సీఎం తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు.