ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కవిత పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా

by Prasad Jukanti |
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కవిత పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో:సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కవిత గతేడాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నళిని చిదంబరం, అభిషేక్, సుమిత్ రాయ్ పిటిషన్లతో కాకుండా కవిత పిటిషన్ ను ప్రత్యేకంగా విచారిస్తామని పేర్కొంది. ఈ నెల 28న కేసు మొత్తం వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. కవిత తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. కాగా తనను ఇంటి వద్దే విచారించాలని పిటిషన్ లో పేర్కొంది. ఈడీ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. సీఆర్పీసీ ప్రకారం ఆడవాళ్లను పిలిచి విచారించడం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్ధం అని పేర్కొన్నారు. అలాగే తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై ఫిబ్రవరి 5వ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇరువర్గాల వాదనలు విన్నది. తదుపరి విచారణ ఫిబ్రవరి 16కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణలో పూర్తి స్థాయి వాదనలు జరగలేదు. దీంతో ఈనెల 28కి వాయిదా పడింది.

Advertisement

Next Story