- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశం
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలన సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును నిలిపి వేసి.. సిట్ దర్యాప్తు కొనసాగేలా ఆదేశాలివ్వాలని ప్రభుత్వం పిటిషన్‌లో కోరింది. కాగా, ఇవాళ ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. గత విచారణ సందర్భంగా సీబీఐ దర్యాప్తు నిలిపివేయాలంటూ ఇచ్చిన ఆదేశాలపై నోటీసులు ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. దీంతో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మినహా సీబీఐ, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ పోలీసులు సైతం ఈ కేసు దర్యాప్తు నిలిపి వేయాలని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను అత్యున్నత న్యాయస్థానం జులై 31వ తేదీకి వాయిదా వేసింది.