- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీడీ యాక్ట్ వ్యవహారం : తెలంగాణ సర్కారు, పోలీసు శాఖకు ‘సుప్రీం’ మొట్టికాయలు
దిశ, నేషనల్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు విభాగంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా సాధారణ నేరస్తులపైనా పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్ట్‌ను ప్రయోగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నేరస్తుడిని కూడా ప్రివెంటివ్ డిటెన్షన్(పీడీ)లో ఉంచిన ఓ కేసును విచారిస్తుండగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. బుర్రను ఉపయోగించి ఆలోచించకుండా ఎవరిపై పడితే వారిపై ఎడాపెడా పీడీ యాక్ట్‌ను ప్రయోగించొద్దని తెలంగాణ పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇస్తున్న ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని ధర్మాసనం ఆశాభావం వ్యక్తం చేసింది. చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన వ్యక్తిపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించగా.. దాని నుంచి విముక్తి కల్పించాలని అతడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే అందుకు హైకోర్టు నో చెప్పింది. పీడీ యాక్ట్‌ను ప్రయోగించడం సబబే అంటూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్ధించింది. దీంతో సదరు వ్యక్తి సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. అతడి పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను కొట్టేసింది. సదరు వ్యక్తిపై ప్రయోగించిన పీడీ యాక్ట్ ఆర్డర్‌ను రద్దు చేసింది. చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఆ వ్యక్తి వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలగనప్పుడు.. అతడిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించడంలో అర్థం లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.