Supreme Court: సుప్రీం కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ.. ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2025-01-02 08:07:13.0  )
Supreme Court: సుప్రీం కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ.. ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో కీలక నిందితుడిగా ఉన్న అడిషినల్ ఎస్పీ మేకల తిరుపతన్న (Tirupathanna) గత సంవత్సరం అక్టోబర్ తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. సుప్రీంకోర్టు (Supreme Court)లో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, నేడు ఆ పిటిషన్ మరోసారి జస్టిస్‌ బీవీ నాగరత్న (BV Nagara Ratna), జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌ (N Kotishwar Singh) ద్విసభ్య ధర్మాసనం విచరణ చేపట్టింది. రాష్ట్ర ప్రభత్వం తరఫున సిద్ధార్థ్ లూథ్రా (Siddharth Luthra) వాదనలు వినిపించగా, పిటిషనర్ తిరుపతన్న తరఫున దుష్యంత్ దవే (Dushyanth Dave) వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే విచారణ మధ్యలో సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు ఇంకెప్పుడు పూర్తి చేస్తారని వ్యాఖ్యనించింది. ఇన్వెస్టిగేషన్ (Investigation) సుధీర్ఘ కాలం కొనసాగడం ఎంతమాత్రం సరికాదని ఆక్షేపించింది. దర్యాప్తు కొనసాగింపు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను తాము అడ్డుకోలేమని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగని దర్యాప్తును అడ్డుకోవాలని తాము అడ్డుకోవాలని అనుకోవడం లేదని కామెంట్ చేసింది. తదుపరి విచారణలోనైనా ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో తిరుపతన్న పాత్రపై పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి సూచించింది. అదేవిధంగా కేసు తదుపరి విచారణను ఈ నెల27కు వాయిదా వేసింది.

Advertisement

Next Story