ట్యాంక్‌బండ్‌లో ప్రశాంతంగా ముగిసిన గణేష్‌ నిమజ్జనాలు

by Mahesh |
ట్యాంక్‌బండ్‌లో ప్రశాంతంగా ముగిసిన గణేష్‌ నిమజ్జనాలు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే నిమజ్జన కార్యక్రమానికి ట్యాంక్ బండ్ Tank bund(హుస్సేన్ సాగర్) వేదిక అయ్యింది. నగర ప్రజల నమ్మకం లో భాగంగా ప్రతి సంవత్సరం ట్యాంక్ బండ్‌లో వేలాది విగ్రహాలను నిజ్జనం చేస్తుంటారు. ఈ క్రమంలో ఈ నెల 17న ఖైరతాబాద్ మహాగణపతి Mahaganapati of Khairatabad నిమజ్జనం తో ప్రారంభమై.. వేలాది విగ్రహాలను పకడ్బందిగా గంగమ్మ ఒడికి చేర్చారు. గత సంవత్సర రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకున్న పోలీసులు police, జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. నిమజ్జనాలను పూర్తి చేశారు. రెండు రోజుల పాటు సాగిన ఈ నిమజ్జన కార్యక్రమం ముగిసినట్లు అధికారుల తెలిపారు. దాదాపు 36 గంటల పాటు నిర్విరామంగా కొనసాగిన నిమజ్జన కార్యక్రమంలో ట్యాంక్ బండ్ లో 6 వేలకు పైగా పెద్ద విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు తెలిపారు. అలాగే మొత్తం 11 రోజుల్లో కలిపి లక్షకు పైగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం అయ్యయని.. 25 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. కాగా మొత్తం నగర వ్యాప్తంగా ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాయనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed