- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలి’
దిశ, మద్దూరు : మండలంలో బంజారా గిరిజన విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో చదువుకుంటున్న విద్యార్థులకు "మేము సైతం యువత కోసం" అనే కార్యక్రమాన్ని గ్రీన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర ఇంచార్జ్ సంతోష్ రాథోడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్త సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ సేవక్ కుమార్ మూడు గంటల పాటు విద్యార్థులకు పరీక్షలను భయం లేకుండా ఎలారాయాలి.. ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి.. లక్ష్యాలను ఎలా సాధించుకోవాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు.
నైతిక విలువలను ఎలా పెంపొందించుకోవాలి లాంటి పలు అంశాలపై "మేము సైతం యువత కోసం" అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారి లియాకత్ అలీ పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతకు చాలా అవసరమన్నారు. విద్యార్థులకు పరీక్షల సమయం కావున ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కావున సమయాన్ని దృష్టిలో పెట్టుకొని బాగా చదివి ఉన్నత మార్కులు సాధించి భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలన్నారు. పరీక్ష సమయంలో ఒత్తిడి లేకుండా విజయాన్ని అధిగమించాలని సూచించారు.
రాష్ట్ర బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి బాగా కష్టపడి చదువుకోవాలని కోరారు. అధ్యాపకులు మరియు విద్యార్థులు చాలా అంశాలు నేర్చుకున్నామని హర్షం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర ఇంచార్జ్ సంతోష్ రాథోడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రావణ్ నాయక్, రాష్ట్ర ప్రెసిడెంట్ శివ నాయక్, సునీల్ నాయక్, బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్, పట్టభద్రుల సంఘం కార్యదర్శి భరత్ కుమార్, జావేద్, అంజి, కళాశాల, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.