ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ హాస్టల్‌లో నీళ్ల కరువు.. వినూత్న రీతిలో స్టూడెంట్స్ నిరసన

by Vinod kumar |   ( Updated:2023-10-05 05:23:08.0  )
ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ హాస్టల్‌లో నీళ్ల కరువు.. వినూత్న రీతిలో స్టూడెంట్స్ నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ఆబిడ్స్ ప్రాంతంలోని జేఎన్ఏఎఫ్ఏయూ ఫైన్ ఆర్ట్స్ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు తమకు నీళ్ల సౌకర్యం నిలిపివేశారని కళాశాల యాజమాన్యం పై వినూత్న తీరులో విద్యార్థులు నిరసన తెలిపారు. మాసబ్ ట్యాంక్‌లోని ప్రధాన కళాశాల ప్రాంగణానికి ఉదయాన్నే విద్యార్థులు బయలు దేరి వెళ్ళి అక్కడే ముఖాలు కడుక్కుని, స్నానాలు చేసి మేనేజ్‌మెంట్ వైఖరిని ఎండగడుతూ వినూత్న నిరసన తెలిపారు. నిజాం కాలం నుంచి ఉనికిలో ఉన్న జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలకు ఆబీడ్స్ గన్‌ఫౌండ్రీలో బాయ్స్ హాస్టల్ ఉంది. ఇది స్టూడెంట్ మేనేజ్డ్( విద్యార్థులచే నిర్వహించుకునే) హస్టల్.


ఆర్థ శతాబ్ద కాలంగా వర్థిల్లుతున్న ఆబీడ్స్ హాస్టల్‌ను కుట్రపూరితంగా ఖాళీ చేయించడానికి ఇటీవల కాలంటో మేనేజ్‌మెంట్ గత రెండు ఏళ్లుగా కొత్త అడ్మిషన్లు నిలిపి వేసిందని విద్యార్థులు ఆరోపించారు. మెస్ సౌకర్యాన్ని బంద్ చేశారని, గత రెండు రోజులుగా హాస్టల్ విద్యార్థుల అవసరాలకు వచ్చే వాటర్ ట్యాంకర్ ను కూడా బంద్ చేశారని, దీంతో విసుగు చెంది నేరుగా కళాశాల ప్రాంగణంలోనే సామూహిక స్నానాలు చేసి నిరసన తెలిపామని హాస్టల్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.


Advertisement

Next Story

Most Viewed