- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ శాఖ బదిలీల్లో భారీగా అవకతవకలు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
దిశ, జనగామ: జనగామ జిల్లాలో జరుగుతోన్న విద్యుత్ శాఖ బదిలీల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఎన్పీడీసీఎల్సీఎండీ బదిలీల గురించి గైడ్‌లైన్స్ విడుదల చేశారు. ఆ గైడ్‌లైన్స్ ప్రకారం జిల్లా అధికారులు బదిలీలు చేపట్టాల్సి ఉండగా.. జిల్లా స్థాయి అధికారులు ఓ యూనియన్‌కు మాత్రమే కొమ్ముకాస్తు బదిలీలను గైడ్‌లైన్స్ ప్రకారం కాకుండా.. ఇష్టారీతిన ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. డబ్బు ఇచ్చిన వారికి అనుకూలంగా పనులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఎన్నో యూనియన్లు ఉన్నా ఓ పేరు మోసిన యూనియన్ కొంత2మంది ఉద్యోగుల నుంచి డబ్బు వసూలు చేసి వారికి కావల్సిన చోట బదిలీ చేయించేందుకు ఒప్పందం చేసుకున్నట్లుగా సమాచారం. ఆ యూనియన్ పెద్దలు జిల్లా స్థాయి అధికారులకు మందు డబ్బు ఆశచూపి గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా బదిలీలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఉద్యోగులు బాహటంగానే చర్చించుకుంటున్నారు. కొంతమంది ఉద్యోగుల కోసం గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా బదిలీలు చేస్తే మిగతా ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని పలువురు వాపోతున్నారు. అసలు ఈ తతంగం అంతా నడిపిస్తుంది ఎవరు.. అసలు బదిలీల్లో ఏం జరుగుతోందనే కోణంలో అధికారులు దృష్టి సారించాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.