- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు గురుకుల కళాశాల విద్యార్థులు
దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాల విద్యార్థులు జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ సెలక్షన్స్ అథ్లెటిక్స్‌లో సత్తా చాటారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రాస్ కంట్రీలో అండర్ 18, 6కేఎం లో కళాశాల విద్యార్థి జి. ఉదయ్ సింగ్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు. అండర్ 20, 8కేఎంలో పి.చందు ద్వితీయ స్థానం, వై.వంశీ తృతీయ స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురు విద్యార్థులు కూడా నెల 18, 19 తేదీల్లో మహబూబాబాద్‌లో జరగబోయే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొననున్నారు. జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌లో ప్రథమ , ద్వితీయ తృతీయ స్థానాలలో నిలిచిన కళాశాల విద్యార్థులను, కళాశాల పిడి. మంతెన శ్రీనివాస్, పీఈటీ సతీష్ , కోచ్ మూల వెంకటేష్‌ని కళాశాల ప్రిన్సిపాల్ హెచ్. రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ సిరిసిల్ల శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు.