- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Student Suicide : మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యా యత్నం

దిశ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల(Mallareddy Women's Engineering College)లో ఓ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం(Student Suicide Attempts)కలకలం రేపింది. కళాశాల భవనం నాలుగో అంతస్తు నుంచి దూకబోయిన బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కీర్తిని సమయస్ఫూర్తితో తోటి విద్యార్థులు, వాచ్ మ్యాన్ సకాలంలో రక్షించారు. ప్రాథమిక సమాచాం మేరకు పరీక్ష ఫెయిల్ అవుతాననే భయంతో ఆ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసినట్లుగా తెలుస్తోంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మల్లారెడ్డి విద్యాసంస్థల్లో గత ఏడాది కాలంలో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం.. కండ్లకోయలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల బాలికల హాస్టల్ లో బాత్ రూమ్ లలో విద్యార్థినిల వీడియోలు, ఫోటోలు తీసిన ఘటన వివాదస్పదమైంది. గత డిసెంబర్ లో సైతం దుండిగల్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
గత జూలైలోనూ మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్శిటీ విద్యార్థి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో 3వ సంవత్సరం చదివే హరినాథ్ అనే విద్యార్థి మైసమ్మ గూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్ బిల్డింగ్ మీద నుంచి దూకి పురుగుల మందు తాగి 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఫిబ్రవరిలో మైసమ్మ గూడ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎండి మహ్మమద్ క్యాంపస్ సెలక్షన్స్ లో ప్లేస్మెంట్ దొరకకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అటు నారాయణ, చైతన్య వంటి కార్పోరేట్ జూనియర్ కళాశాలల్లోనూ విద్యార్థుల బలవన్మరణ ఘటనలు తరుచు కొనసాగుతున్నాయి. ప్రవైటు, కార్పోరేటు విద్యాసంస్థల్లో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.