Tammineni Veerabhadram: బీఆర్ఎస్‌తో పొత్తు అయినా పోరాటం.. తమ్మినేని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-28 15:17:59.0  )
Tammineni Veerabhadram: బీఆర్ఎస్‌తో పొత్తు అయినా పోరాటం.. తమ్మినేని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఢిల్లీలోని సుర్జిత్ భవన్ లో కేంద్ర కమిటీ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉందన్నారు. మోడీ, అమిత్ షాలు రాష్ట్రంలో పర్యటించిన బీజేపీలో చేరికలు లేవని సెటైర్ వేశారు. బీఆర్ఎస్ అంసతృప్త నాయకులు అందుకే వేరే పార్టీల్లో చేరుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి ఉంటాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తోనే కలిసి ముందుకెళ్తాం అన్నారు. సీట్ల పంపకాలపై ఇంకా డిసిషన్ తీసుకోలేదన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉన్నా గవర్నమెంట్ కొన్ని వాగ్ధానాలు నెరవేర్చడం లేదన్నారు. హామీల అమలు కోసం పోరాటం చేస్తామన్నారు.

Also Read..

1977 నుంచి ఇప్పటివరకు ఏప్రిల్-28 న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలివే..

తెలంగాణపై శివసేన ఫోకస్.. అనూహ్యంగా అధ్యక్షుడి నియామకం

Advertisement

Next Story