- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గురుకులాల్లో ఆత్మహత్యల కట్టడికి పకడ్బందీ చర్యలు

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో వివిధ సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు సన్నద్ధం అవుతోంది. ప్రధానంగా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి ఆత్మహత్యల నివారణ దిశగా అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందుచూపుతో గురుకులాల్లో ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం మొదటగా గురుకులాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా కట్టడి చేయాలని ముందస్తు చర్యల్లో భాగంగా టీచర్లకు శిక్షణ ఇవ్వాలని సంకల్పించారు.
ఎంసీఆర్ హెచ్ఆర్డీఐలో ట్రైనింగ్..
గురుకుల విద్యార్థుల్లో కుంగుబాటును దూరం చేసి మానసిక ఆరోగ్యం పెంపొందించే కార్యక్రమంలో భాగంగా దేశంలో ప్రతిష్టాత్మకమైన ఎన్ఎల్పీ మాస్టర్ ట్రైనర్ రఫీ నేతృత్వంలో (మ్యాజిక్ ఆఫ్ చేంజ్ సంస్థతో కలిసి) గురుకుల టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. సోమ, మంగళవారాలు (మార్చి 17, 18 ) రెండు రోజుల పాటు హైదరాబాద్లోని (ఎంసీఆర్ హెచ్ఆర్డీఐ) మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థలో గురుకుల టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 120 మందికి, 19, 20 తేదీల్లో 118 మందికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య మరింత అర్థవంతమైన భావోద్వేగ అనుబంధాన్ని నెలకొల్పడం, విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, విద్యార్థులు విద్యలో మెరుగైన పనితీరు కనబరచడం వంటి ముఖ్యమైన లక్ష్యాలతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించామని టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ గురుకుల డాక్టర్ వీఎస్ అలగు వర్షిణి తెలిపారు.
సర్వేలు చెబుతున్న నిజాలు..
మెల్ బోర్న్ వర్సిటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ పలు ఇండియన్ మెడికల్ కాలేజీలు సంయుక్తంగా (ఎన్ఐఐఎంహెచ్ ఏఎన్ఎస్) భారతదేశంలో నిర్వహించిన సర్వేలో పలు ఆందోళన కలిగించే విషయాలను వెల్లడించింది. పది మంది విద్యార్థుల్లో ఒకరు ఆత్మహత్య ఆలోచనలు కలిగి ఉన్నారని తెలిపింది. పది మందిలోనే ఉంటారు.. కానీ, ఎప్పుడూ ఒంటరిగానే ఫీలింగ్, బతకడం దండగ అనే భావనలతో ఉంటారని పేర్కొంది. పది మంది స్టూడెంట్లలో ఒకరు ఆత్మహత్య ఆలోచనల చుట్టూ తిరుగుతున్నట్లు గుర్తించారు. తొమ్మిది రాష్ట్రాల్లోని 30 వర్సిటీలకు చెందిన 8,542 మంది స్టూ డెంట్ల ప్రవర్తనపై ఈ స్టడీ చేశారు.
2 శాతం మంది స్టూడెంట్లు ఏడాదిలో ఆత్మహత్య ఆలోచనలు చేయగా.. 5 శాతం మంది ఆత్మహత్యయత్నాలు కూడా చేసినట్లు ఈ సర్వే వెల్లదించింది. 40 మంది విద్యార్థులున్న క్లాస్ లో నలుగురు జీవితంపై ఆశలు కోల్పోయారని, ఇద్దరు ఆత్మహత్యకు ప్రయత్నించారని స్టడీ పేర్కొంది. ఐఐటీ, నీట్, ఐఐఎం స్టూడెంట్లలోనూ సూసైడ్ టెండెన్సీ ఎక్కువగా ఉందని తెలిపింది. పరీక్షల ఒత్తిడి, కుటుంబ సంబంధాలు సరిగా లేకపోవడమే ప్రధాన కారణమని పేర్కొంది. ఈ సర్వే పై గురుకుల కార్యదర్శి డాక్టర్. వి ఏస్ అలగు వర్షిణి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముందుచూపు చర్యల్లో భాగంగానే ఆత్మహత్యల.. కట్టడికి పకడ్బందీ చర్యలకు సిద్ధం అయ్యారు.