పిచ్చి కుక్కల స్వైర విహారం.. ఏకంగా 10 మందిపై..

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-19 08:32:41.0  )
పిచ్చి కుక్కల స్వైర విహారం.. ఏకంగా 10 మందిపై..
X

దిశ, కొండపాక : సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం కేంద్రంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేసాయి. పిచ్చికుక్కల దాడిలో మండల కేంద్రానికి చెందిన దాదాపు 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కుకునూర్ పల్లి మండల కేంద్రానికి చెందిన లక్మణ్ రావు పంతులు , మంద సత్తయ్య,గంగిశెట్టి శండవ్వ, సుజాత, శ్రీకృతితో పాటు మరో 5 మంది పిచ్చికుక్క దాడిలో గాయాలు కావడంతో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంటి బయట ఉన్న వారిపై కుక్క దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టి పిచ్చికుక్కలను బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే మరికొంత మందిపై దాడి చేసి గాయపరిచే ప్రమాదం ఉంటుందన్నారు.

Advertisement

Next Story