- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదు.. రాష్ట్ర మంత్రి షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, బీజేపీలు వేర్వేరు కాదని.. రెండూ ఒక్కటే అని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మంచి చేస్తుంటే బీఆర్ఎస్ నేతల కళ్లలో మంటగా ఉందని అన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లలేదని చురకలు అంటించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం పెట్టుబడులు తెచ్చేందుకు వెళ్లారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తు్న్న బీఆర్ఎస్ నిర్మాణాత్మక సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా బీఆర్ఎస్‌కు బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యలు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలని హితవు పలికారు. గత పదేళ్లో అక్రమాలకు పాల్పడిన ఎవరినీ విడిచిపెట్టబోమని.. దోషులను తప్పకుండా శిక్షిస్తామని అన్నారు.