తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: State Chief Kishan Reddy' కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-07-21 11:00:38.0  )
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: State Chief Kishan Reddy కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మాజీ చీఫ్ బండి సంజయ్ నుండి బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి.. పార్టీ నేతల సమక్షంలో అధ్యక్షుడిగా రిజిష్టర్‌లో సంతకం చేశారు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 1980 నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని.. అయిన ఇప్పటి వరకు అలసి పోలేదని అన్నారు.

తాను బీజేపీ నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. కానీ కేంద్రమంత్రిని అవుతానని ఎప్పుడు అనుకోలేదని అన్నారు. బీజేపీలో కష్టపడి పని చేస్తే ప్రతి ఒక్కరికి తప్పకుండా అవకాశం వస్తుందని తెలిపారు. ఇక, రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరం పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ సారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కిషన్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. ఇక, తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మాజీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, తదితర నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

Read more : disha newspaper



Advertisement

Next Story