Braking: స్టాఫ్ నర్స్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఆ రోజు నుంచే నియామక పత్రాల పంపిణీ

by Ramesh N |   ( Updated:2024-01-28 09:59:33.0  )
Braking: స్టాఫ్ నర్స్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఆ రోజు నుంచే నియామక పత్రాల పంపిణీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 7094 స్టాఫ్ నర్సు ఉద్యోగాల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల పరంగా మహిళలకు హారిజంటల్ రోస్టర్ విధానంలో ఫలితాలు వెల్లడించామని పేర్కొంది. మెరిట్ లిస్ట్, వెయిటేజీ పాయింట్లు, ఒరిజినల్ సర్టిఫికెట్ల ధృవీకరణ ఆధారంగా, తొమ్మిది డిపార్ట్‌మెంట్లలో స్టాఫ్ నర్సు పోస్టులకు 6,956 మందిని ఎంపిక చేసినట్లు తెలిపింది.

వీరందరికి జనవరి 31వ తేదీన ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ ఇతర అధికారులు హజరుకానున్నారు. కొత్త ప్రభుత్వంలో చేయబోతున్న ఫస్ట్ ఉద్యోగాల భర్తీ కావడంతో ఫుల్ పబ్లిసిటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనిలో భాగంగానే నియామక పత్రాలను సెలబ్రేషన్ రూపంలో అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతున్నది.

Advertisement

Next Story

Most Viewed