- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
SSC లీకేజీ కేసు : ప్రశాంత్ చుట్టూ తెలంగాణ రాజకీయం!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో లీక్‌ల వ్యవహారం దుమారం రేపుతోంది. వరుసగా ప్రశ్నపత్రాలు లీక్ కావడం సంచలంగా మారుతోంది. టీఎస్‌పీఎస్సీ వ్యవహారం మరువక ముందే టెన్త్ ప్రశ్నాపత్రాలు బహిర్గతం కావడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ అంశంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య రాజకీయం సెగలు కక్కుతోంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు రాజశేఖర్ అనే ఉద్యోగి చుట్టూ తిరగగా టెన్త్ ప్రశ్నపత్రాల కేసులో ప్రశాంత్ అనే వ్యక్తి కేంద్ర బిందువుగా మారారు. ప్రశాంతే వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
దీంతో ప్రశాంత్‌కు బీజేపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని ఇందంతా ప్లాన్ ప్రకారం కుట్ర జరుగుతోందని అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేయడం దుమారానికి కారణం అయింది. ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ని ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారని బీజేపీ భగ్గముంటుంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రశ్నపత్రాల పేపర్ లీక్‌లో బండి సంజయ్ పాత్ర ఉందని మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది. ఇక ఈ విషయాన్ని బీజేపీ లీగల్ ఫైట్ ద్వారా ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది.
బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య పలు కేసుల్లో న్యాయపోరాటం జరుగుతోంది. తాజాగా బండి సంజయ్ విషయంలో ఈ న్యాయపోరాటం ఎటువైపు దారి తీస్తుందనేది ఉత్కంఠగా మారింది. అయితే బండి సంజయ్ అరెస్ట్ వెనుక పొలిటికల్ డైవర్షన్ కోణం ఉందని అని బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే.. పేపర్ లీకేజీ వెనుక బండి సంజయ్ పొలిటికల్ మైలేజ్ పొందాలనే కుట్ర కోణం ఉందనే వాదన బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. దీంతో గేమ్ అంతా ఇరు పార్టీల మధ్య వార్‌గా సాగుతోంది. ఈ అంశంలో పొలిటికల్ మైలేజ్ కోసం రాజకీయ పార్టీలు ప్రాకుడుతుంటే పేపర్ లీకేజీలో ముఖ్యంగా టీఎస్‌పీఎస్సీ లీకేజీలో నిజమైన బాధితులకు న్యాయం జరిగేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.