SSA: ఉపాధ్యాయుల నిరవధిక సమ్మె.. ఎంఈవోను చుట్టుముట్టిన విద్యార్థులు

by Ramesh Goud |
SSA: ఉపాధ్యాయుల నిరవధిక సమ్మె.. ఎంఈవోను చుట్టుముట్టిన విద్యార్థులు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో సమగ్ర శిక్ష ఉపాధ్యాయులు(Samagra Shiksha teachers) గత కొద్ది రోజులుగా నిరవధిక సమ్మెలో(Indefinite strike) ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ పాఠశాలలో తనిఖీ కోసం వెళ్లిన ఎంఈవోను(MEO) విద్యార్ధులు చుట్టుముట్టారు. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) మహేశ్వరం మండల(Maheswaram Mandal) కేంద్రం కేసీ తాండ(KC Thanda)లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల(Kasturba Gandhi Girls School)లోని సమగ్ర శిక్ష ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. దీంతో విద్యార్థులకు పాఠాలు చెప్పే వాళ్లు కరువయ్యారు. ఈ క్రమంలో ఎంఈఓ కాస్నా నాయక్(MEO Kasna Nayak) పాఠశాలను తనిఖీ చేసేందుకు వెళ్లారు. దీంతో బాలికలు ఎంఈవోను చుట్టుముట్టారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు సమ్మెలో ఉన్నారని, పరీక్షలు దగ్గర పడుతుండటంతో ఉపాధ్యాయులు లేక సిలబస్ పూర్తి కాలేదని వాపోయారు. ఉపాధ్యాయులను సమ్మె విరమింప చేయాలని, లేదంటే కొత్త ఉపాధ్యాయులను తీసుకొని రావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు నినాదాలు చేస్తూ.. ఎంఈవో ముందే బాలికలు ఆందోళనకు దిగారు.

Advertisement

Next Story

Most Viewed