కేటీఆర్‌తో శ్రీలంక మంత్రి భేటీ.. బీఆర్ఎస్ పాలనపై ప్రశంసలు

by Mahesh |
కేటీఆర్‌తో శ్రీలంక మంత్రి భేటీ.. బీఆర్ఎస్ పాలనపై ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తో శ్రీలంక మంత్రి సతాశివన్ వియలందేరన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో సాధించిన ప్రగతి గురించి.. గతంలో శ్రీలంక పార్లమెంట్‌లో ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో హైదరాబాద్ నగరం అభివృద్ధి సింగపూర్‌ను తలపించేలా జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణను పెట్టుబడులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చారని, ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరుగుతుంటే.. తెలంగాణ రాష్ట్రంలో అవకాశాల అక్షయపాత్రగా మార్చిన తీరు స్ఫూర్తిదాయకం అని శ్రీలంక మంత్రి సతాశివన్ వియలందేరన్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed