Bhatti Vikramarka: స్కూళ్ళలో ఇకపై మస్ట్ గా స్పోర్ట్స్ పీరియడ్: భట్టి

by Prasad Jukanti |   ( Updated:2024-08-27 15:46:45.0  )
Bhatti Vikramarka: స్కూళ్ళలో ఇకపై మస్ట్ గా స్పోర్ట్స్ పీరియడ్: భట్టి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తప్పనిసరిగా ఒక స్పోర్ట్స్ పీరియడ్ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన ఉద్యోగుల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం.. ప్రపంచ స్థాయి క్రీడా పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం పెరిగేలా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో ప్రసిద్ధ క్రీడా పోటీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్వహణ కోసం అవకాశం ఇవ్వాలని ఇటీవలే కేంద్ర క్రీడాశాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. క్రీడలకు నిధుల కొరత లేదని, అవసరాలకు తగిన విధంగా నిధులు కేటాయిస్తామన్నారు. క్రీడల ద్వారా వచ్చే స్ఫూర్తి జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గత పాలకుల నుంచి వచ్చిన క్రీడా సముదాయాలను, ఆస్తులను మరమ్మతులు చేసి అభివృద్ధి చేయబోతున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed