ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి క్రీడలే ప్రధానం : బోయినపల్లి వినోద్ కుమార్

by Vinod kumar |
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి క్రీడలే ప్రధానం : బోయినపల్లి వినోద్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్యవంతమైన సమాజానికి క్రీడలే ప్రధానమని, క్రీడా రంగాన్ని పటిష్టం చేయడం ద్వారా అన్ని రంగాల్లో ముందంజలో ఉంటామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని సాట్స్ కార్యాలయంలో సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ తో భేటీ అయ్యారు. క్రీడల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ క్రీడాభివృద్ధి అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాకుండా సమాజంలోని అన్ని వర్గాల వారు క్రీడల్ని ఆదరించడం, ప్రోత్సహిస్తే విద్యార్థులు, యువకులు ఆసక్తి చూపే అవకాశం ఉందన్నారు.

రాష్ట్రంలోని ప్రతి పల్లెలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు అయ్యాయని, వీటిని సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని, ప్రైవేటు సంస్థలు కూడా క్రీడాభివృద్ధికి ముందుకు రావాలని కోరారు. క్రీడాకారులకు ప్రైవేటు సంస్థలు కూడా ఉపాధి కల్పించడానికి సాట్స్‌ వారధిలాగా పని చేయాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి తెలంగాణా క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించేలా ‘సాట్స్‌’ కార్యకలాపాలు, ప్రణాళికలు ఉండాలన్నారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రణాళిక సంఘం తరపున సహకారం అందించాలని ఆంజనేయ గౌడ్‌ విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు.

Advertisement

Next Story