- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్పెక్ట్రా మాయ.. 30 వెంచర్లు అప్రూవల్ ఎన్ని?
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో స్పెక్ట్రా గ్రూప్ 30కి పైగా ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. సుమారు 30 వేల మంది కస్టమర్లకు సేవలందించింది. ఇప్పటి వరకు చేపట్టిన ప్రతి ప్రాజెక్టుకూ ఓ ప్రత్యేకత ఉన్నది. రాష్ట్రంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుల్లో స్పెక్ట్రాకు ఓ ప్రత్యేక స్థానం ఉన్నది. అంటూ ఇలా మొన్నటి వార్షికోత్సవ వేడుకల్లో యాజమాన్యం గొప్పగా ప్రచారం చేసుకున్నది. యాదాద్రి, షాద్నగర్ ప్రాంతాల్లో గెలాక్సీ డివైన్, గెలాక్సీ గోల్డ్, వైస్రాయ్ రెసిడెన్సీ, ఫార్చూన్, డైమండ్ వంటి ప్రాజెక్టులను ఆధునిక సదుపాయాలతో ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు బ్రోచర్లలో తెలిపింది.
కానీ ముందుగా కస్టమర్లకు పంపిణీ చేసిన వాటిలో సదుపాయాల కల్పనను గాలికి వదిలేసింది. వెంచర్లో యాజమాన్యం ప్రకటించిన సదుపాయాలన్నీ కల్పిస్తేనే ఆ లేవుట్కు ఫైనల్ అప్రూవల్ లభిస్తుంది. అది పొందిన వాటికే ఇండ్ల నిర్మాణం కోసం అనుమతి లభిస్తుంది. కానీ క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పనులు చేస్తున్నామంటూనే ప్లాట్లను యాజమాన్యం అమ్మేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో స్పెక్ట్రా చేపట్టిన వెంచర్లలో ఎన్నింటికి ఫైనల్ అప్రూవల్స్ వచ్చాయి? ఎన్ని వెంచర్లల్లో మార్ట్ గేజ్ ప్లాట్లు రిలీజ్ అయ్యాయి? వాటిని ఎవరికి విక్రయించారు? మౌలిక సదుపాయాలన్నీ కల్పించారా? ఓపెన్ స్పేస్, పార్కు స్థలాలను, సోషల్ ఇన్ ఫ్రా కోసం వదిలేసిన స్థలాలను స్థానిక సంస్థలకు గిఫ్ట్ డీడ్ చేశారా? ఒక వేళా వాటన్నింటినీ పూర్తి చేస్తే ఫైనల్ అప్రూవల్స్ ఎందుకు రాలేదు? అనే ప్రశ్నలు కస్టమర్ల నుంచి యాజమాన్యానికి ఎదురవుతున్నాయి.
ఫైనల్ అప్రూవల్ రాలేదు?
చిన్న కంపెనీలు మొదట్లో లే అవుట్ను డెవలప్ చేసి ప్లాట్లను అమ్మేస్తాయి. సదుపాయాలు కల్పించిన తర్వాత మార్ట్ గేజ్ ప్లాట్లను రిలీజ్ చేయించుకుంటాయి. అనంతరం ఆ ప్లాట్లను కూడా అమ్మేస్తాయి. అనంతరం మరో ప్రాజెక్టును చేపడతాయి. కానీ స్పెక్ట్రా మాత్రం లెక్కలేనన్ని లే అవుట్లను వేస్తూనే ఉన్నది. కానీ అభివృద్ధి విషయాన్ని యాజమాన్యం మరిచిపోయిందని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. అందుకే ఈ యాజమాన్యం చేపట్టిన లే అవుట్లలో ఐదారుకు మించి ఫైనల్ అప్రూవల్ రాలేదని టాక్. మార్ట్ గేజ్ ప్లాట్లనూ ఎందుకు రిలీజ్ చేయించుకోవడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఏయే వెంచర్లకు ఫైనల్ అప్రూవల్స్ వచ్చిందనే విషయాన్ని సైతం గోప్యంగా ఉంచుతున్నది. చివరికి మార్కెటింగ్ స్టాఫ్కు సైతం వెల్లడించకపోవడం గమనార్హం.
అధికారుల అండదండలు
దశాబ్దకాలం క్రితం చేపట్టిన లే అవుట్లోనే అభివృద్ధి పనులేవీ చేయకుండా కొత్తగా మరో చోట మార్కెటింగ్ చేస్తున్నారు. పాత లే అవుట్లలోని మార్ట్ గేజ్ ప్లాట్లను ఎందుకు రిలీజ్ చేయించుకోవడం లేదని హెచ్ఎండీఏ, డీటీసీపీ, వైటీడీఏ అధికారులు అడగకపోవడం గమనార్హం. కొత్త వాటికి ఆమోదం తెలుపుతూనే ఉన్నారు. భవిష్యత్తులో ప్లాట్ల యజమానులెవరైనా ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలనుకుంటే స్థానిక సంస్థలకు ఫైనల్ లే అవుట్ అప్రూవల్ కాపీని సమర్పించాల్సిందే. ఆ సమయంలో ఇండ్ల నిర్మాణాలకు అడ్డంకులు ఎదురుకావడం ఖాయమని రియల్ ఎస్టేట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఏ వెంచర్లోనైనా అభివృద్ధి బాధ్యత సదరు కంపెనీ యాజమాన్యంపైనే ఉంటుంది. యాజమాన్యానికి అధికారులతో పాటు పొలిటీషియన్స్ అండదండలు పుష్కలంగా ఉండడం వల్లే లేఅవుట్ ఫైనల్ అప్రూవల్స్ లేకున్నా నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డెవలప్ చేస్తేనే ఫైనల్ (బాక్స్)
హెచ్ఎండీఏ, డీటీసీపీ నుంచి అనుమతులు పొందిన ఏ లే అవుట్లలోనైనా కొన్ని ప్లాట్లను మార్ట్ గేజ్ చేస్తారు. ఆ సంస్థ యాజమాన్యం ప్రకటించిన సదుపాయాలు (పార్కులు, బీడీ రోడ్లు తదితర పనులు చేపట్టాలి) కల్పించాలి. లే అవుట్లలో పార్కులు, ఇతర సామాజిక అవసరాల కోసం వదిలేసిన స్థలాలను తప్పనిసరిగా స్థానిక సంస్థలకు గిఫ్ట్ డీడ్ చేయాలి. వాటన్నింటినీ హెచ్ఎండీఏ లేదా డీటీసీపీకి సమర్పిస్తే క్షేత్ర స్థాయిలో పరిశీలించి లే అవుట్ ఫైనల్ అప్రూవల్స్ ఇస్తారు. రియల్ ఎస్టేట్ రెగ్యులరేటరీ అథారిటీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా మూడేండ్లలోపే ఈ ఫైనల్ అప్రూవల్స్ తీసుకోవాలన్న నిబంధనలు ఉన్నాయి. ఈ అప్రూవల్స్ పొందకపోతే స్థానిక సంస్థలు ఆ లేఅవుట్లలో ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు చేయొద్దనే రూల్స్ ఉన్నాయి.
యాదాద్రిలో స్పెక్ట్రా ప్రాజెక్టులు
సురభి ఎన్క్లేవ్, సురభి గ్రాండ్, సురభి గోల్డ్, సురభి గోల్డ్ ప్రీమియం, సురభి గార్డెన్స్, సురభి ఎలైట్, సురభి హైట్స్, సురభి ప్లాటినం, సురభి టౌన్ షిప్, శుభం ఎన్ క్లేవ్, స్పెక్ట్రా గ్యాలక్సీ, స్పెక్ట్రా డైమండ్, గ్యాలక్సీ ప్రీమియం, డైమండ్ జ్యుయెల్, యశోవన్, యశోవన్ ప్రీమియం, గ్రాండ్ గ్యాలక్సీ, గ్యాలక్సీ ఎక్స్ క్యూటివ్ సెక్టార్, గ్యాలక్సీ రెసిడెన్సీ, గ్యాలక్సీ గోడ్ల్, గ్యాలక్సీ గోల్డ్ ప్రీమియం, స్పెక్ట్రా సెరెనిటీ, స్పెక్ట్రా డివైన్, గ్యాలక్సీ డివైన్. షాద్నగర్ ప్రాంతంలో బ్లూ బర్డ్, ఫెరిఫెరల్ సిటీ, ఫెరిఫెరల్ టౌన్ షిప్, స్పెక్ట్రా సిటీ, ప్రాడో, ప్రాబో ప్రీమియం, స్పెక్ట్రా ఫార్చూన్, మై డెస్టినీ, మై డెస్టినీ ప్రీమియం ఉన్నాయి. విజయవాడ హైవేలో ఎకో ఇండస్ రెసిడెన్సీ, హైవే సిటీ ప్రీమియం, హైవే సిటీ, స్పెక్ట్రా సిటీ విల్లాస్, స్పెక్ట్రా యశోవన్ విల్లాస్ వెలిశాయి. శ్రీశైలం హైవేలో మెగా సిటీ, మై సిటీ వెంచర్లు ఉన్నాయి. స్పెక్ట్రా ఇన్ని వెంచర్లు చేపట్టిన ఇందులో ఐదారు మినహా వేటిలోనూ మార్ట్ గేజ్ చేసిన ప్లాట్లను రిలీజ్ చేయించుకోవడం లేదని సమాచారం.
Also Read...