- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Social Media లో పోస్ట్‌లు పెడుతున్నారా..? అయితే ఈ వార్తను ఒక్కసారి చదవండి
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల సీజన్‌కు అధికార పార్టీ జాగ్రత్తలు తీసుకుంటున్నది. పార్టీపై, ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకమైన పోస్టులు రాకుండా కట్టడి చేసే చర్యలు చేపట్టింది. ఇటీవల కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కార్యాలయంపై వ్యూహాత్మకంగా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే ప్రభుత్వ ఉద్యోగవర్గాలపై దృష్టి పెట్టింది. ఏకంగా ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి వరకు హెచ్చరికలు జారీ అయ్యాయి. రెండు రోజుల నుంచి శాఖల వారీగా యూనియన్ల నేతలను పిలిపించుకుని సోషల్‌మీడియా పోస్టులపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో పోస్టులు పెట్టిన వారిని ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు అడపాదడపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసే యూనియన్ల నేతలకు స్పెషల్ కండీషన్స్ పెడుతున్నారు.
గతంలోనూ కేసులు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో గతంలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆర్టీసీ సమస్యలపై కార్మికులు వీడియోలతో పోస్టులు పెడితే.. సస్పెన్షన్వేటు వేశారు. ఓ ఉపాధ్యాయుడిపైనా కేసు పెట్టారు. అయితే, ఇప్పటివరకు వీటిని తేలిగ్గా తీసుకున్నా.. ఇక నుంచి మాత్రం కఠినంగా వ్యవహరించాలని సీఎం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి.
పోస్టు జాగ్రత్త
సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతో ఇప్పుడు పనిచేస్తున్న కుర్చీలు జాగ్రత్త అంటూ ఉన్నతాధికారులు నేరుగా హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఉపాధ్యాయులకు సంబంధించిన 317 జీవో సమస్యలపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తున్న ఓ యూనియన్నేతను ఏకంగా సెక్రెటేరియేట్‌కు పిలిపించి మాట్లాడారు. శాఖల నుంచి ఎలాంటి సమాచారం కూడా బయటకు రావద్దని, వాటిని బహిరంగంగా సోషల్‌మీడియాలో పెట్టవద్దంటూ నేరుగా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల సోషల్ మీడియా గ్రూపులను రోజువారీగా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏ గ్రూపుల్లోనైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు వస్తే వెంటనే ఉన్నతస్థాయి నుంచి రియాక్షన్ వస్తున్నది.
సైలెంట్ మోడ్‌లోకి యూనియన్లు
సోషల్ మీడియా ప్రచారంపై ప్రభుత్వం సీరియస్‌నెస్ పెంచడంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల యూనియన్లు ఒక్కసారిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లాయి. మూడు రోజుల కిందట వరకు డిపార్ట్‌మెంట్ల వారీగా ఏవైనా కొన్ని వ్యతిరేక కామెంట్లను పెట్టే వారంతా ఇప్పుడు సోషల్ మీడియాకే దూరంగా ఉంటున్నారు. దీంతో యూనియన్ల గ్రూపులు కేవలం గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెస్సేజ్‌లతోనే నిండుతున్నాయి.
Also Read....
- Tags
- Social media