- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Special Ganapathi: ముంబై నుండి భద్రాద్రికి వచ్చిన స్పెషల్ గణపయ్య.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసి ఉండరుగా
దిశ భద్రాచలం: వినాయక చవితి పర్వదినం రోజు ఏర్పాటు చేసే విగ్రహాల్లో ముంబైలోని లాల్ బాగ్చా రాజా వినాయకునికి దేశంలోనే ఎంతో ప్రత్యేకత ఉంది. అయితే ఈసారి భద్రాచలంలో ముంబైలో నెలకొల్పిన విగ్రహం లాంటి వినాయకున్ని ప్రత్యేకంగా ముంబై నుంచి తీసుకుని వచ్చారు. ఇలాంటి విగ్రహం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేకపోవడం విశేషం. చతుర్బుజ గణనాధుడు ఒక చేతిలో చక్రం, మరో చేతిలో గొడ్డలి పోలిన ఆయుధం, మరొక చేతితో భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు ఉన్న ఈ విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక డాక్టర్ ఆర్.నాగేశ్వర్ రావు వీధి నందు ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ముంబై నుండి తీసుకుని వచ్చారు అని తెలియడంతో దర్శించడానికి భక్తులు క్యూ కడుతున్నారు.. భద్రాద్రి క మహారాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎస్పి అంకిత్ కుమార్ పాల్గొని వారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరిపించారు. అలాగే భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు దంపతులు అఖండ దీపారాధన చేశారు.