- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం.. తెలంగాణ నుంచి మరొకరు రాజ్యసభకు!
దిశ, తెలంగాణ బ్యూరో: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రం నుంచి పది ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం తెలంగాణకు ప్రయారిటీ ఇస్తున్నట్లు జనాల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ బ్యూరోక్రాట్ కు రాజ్యసభకు పంపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కళారంగం లేదా ఇతర ఏ రంగం నుంచైనా బ్యూరోక్రాట్‌కు రాజ్యసభకు పంపించాలని యోచిస్తున్నట్టు టాక్.
పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేని వారికి..
పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేని బ్యూరోక్రాట్లకు రాజ్యసభ పదవి ఇవ్వాలని బీజేపీ పెద్దలు డిసైడ్ అయినట్లు తెలిసింది. అయితే తెలంగాణపై పూర్తిస్థాయి పట్టున్న వారికి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారికి రాజ్యసభ ఇవ్వనున్నారనే చర్చ జరుగుతున్నది. అయితే ఇప్పటికే పార్టీలో చేరిన వారికి రాజ్యసభ ఇస్తారా? లేక కొత్త వారి కోసం అన్వేషిస్తారా? అనేది సస్పెన్స్ గా మారింది. పార్టీలో రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్, రిటైర్డ్ ఐఏఎస్ చంద్రవదన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అయితే కృష్ణప్రసాద్ అసెంబ్లీ టికెట్ ఆశించకుండా.. వరంగల్ పార్లమెంట్ రేసులో ఉన్నారు. దీంతో ఆయనకు లోక్ సభ టికెట్ ఇవ్వాలనే యోచనలో పార్టీ కూడా ఉన్నట్టు సమాచారం. మరి చంద్రవదన్ కు రాజ్యసభ పోస్టు ఇస్తారా? లేక ఇంకా ఎవరికైనా ఇస్తారా అనేది వేచి చూడాలి.
ఇంకెవరైనా చేరనున్నారా!
ఫిబ్రవరిలో జాయినింగ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఇప్పటికే పదాధికారుల సమావేశంలో నేతలకు స్పష్టం చేశారు. రాజకీయ నేతలతోపాటు సామాజిక సేవలు చేసే వారికీ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ బ్యూరోక్రాట్లు ఎవరైనా బీజేపీలో చేరే అవకాశముందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీ రాజ్యసభ సీటు ఎవరికి కేటాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఆ రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఎవరనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్నది.