తెలంగాణలో ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్స్.. ఎక్కడెక్కడో తెలుసా?

by Ramesh N |
తెలంగాణలో ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్స్.. ఎక్కడెక్కడో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ట్రాన్స్ జెండర్లు అనారోగ్యం వస్తే చూపించుకోవడానికి ఆసుపత్రులకు వెళ్లలేరు. ఎక్కడికి వెళ్లినా చుట్టూ ఉన్న పదిమంది చూపు వీరిపైనే ఉంటుంది. వివక్ష, ప్రైవేటు వైద్యం చేయించుకునేందుకు స్థోమత లేని వారు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2022లో వరంగల్ ఎంజీఎంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా ఓ ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేశారు. వరంగల్ పరిసర ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో హిజ్రాలు దవాఖానకు వస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఉస్మానియా ఆస్పత్రిలో సైతం ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేసింది.

ఇటీవల మహాబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేకంగా క్లినిక్ ఏర్పాటు చేశారు. తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేశారు. ఈ క్లినిక్‌ను హస్పటల్ సుపరిండెంట్ డాక్టర్ దయాల్ సింగ్ ప్రారంభించారు. ట్రాన్స్ జెండర్లకు అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. వారి కోసం ప్రత్యేక డాక్టర్‌తో పాటు నర్సు సిబ్బందిని కూడా నియమించినట్లు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ హిమబిందు తెలిపారు.



Next Story