SP Prabhath Kumar: ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోన్న కూంబింగ్.. ఎస్పీ ప్రభాత్ కుమార్ కీలక ప్రకటన

by Shiva |   ( Updated:2024-10-05 07:55:18.0  )
SP Prabhath Kumar: ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోన్న కూంబింగ్.. ఎస్పీ ప్రభాత్ కుమార్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: చత్తీస్‌గఢ్ (Chhattisgarh) అడవుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. అబూజ్‌మడ్ (Abuzmud) ఏరియాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ (Encounter)లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నారాయణ్‌పూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతాలైన నెందూర్, గోవెల్, తుల్‌తులీ గ్రామాల దండకారణ్యంలో శుక్రవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో మొత్తం 31 మంది మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. అందులో మావోయిస్టు పార్టీ (Maoist Party) అగ్ర నేతలు నీతి, కమలేశ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, వారిపై రూ.8 లక్షల చొప్పున రివార్డులు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అందులో ఏకే-47, ఎస్ఎల్ఆర్, ఆటోమెటిక్ వెపన్స్ స్వాధీనం చేసుకున్నామని బస్తర్ ఐజీ సుందర్​రాజ్ (Sundar Raj), నారాయణ్​పూర్, దంతెవాడ ఎస్పీలు ప్రభాత్​కుమార్ (SP Prabhath Kumar), గౌరవ్ రాయ్ (SP Gaurav Roy) తెలిపారు.

ఈ సందర్భంగా నారాయణ‌పూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ (SP Prabhath Kumar) మాట్లాడుతూ.. ప్రస్తుతం భద్రతా దళాల కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 31 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. మృతదేహాలను పోలీస్ స్టేషన్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. 40 నుంచి 50 మంది మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారం మేరకు అబూజ్‌మడ్ (Abuzmud) అడవుల్లో కూంబింగ్ చేపట్టామని తెలిపారు. రెండు రోజులు నిర్విరామంగా ఆపరేషన్ కొనసాగిందని ఆయన వెల్లడించారు. ఈ మొత్తం ఒకే ఒక్క జవాన్ గాయపడ్డాడని తెలిపారు. భౌగోళిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ తాము మావోయిస్టులపై వరుస విజయాలు సాధిస్తున్నామని ఎస్పీ ప్రభాత్ కుమార్ స్పష్టం చేశారు.

వివరాలు వెల్లడించాలని పౌర హక్కుల సంఘం నేతల డిమాండ్

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం స్పందించింది. అధికారులు వెంటనే మృతుల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేసింది. మృతుల్లో ముఖ్య నేతలు నంబాల కేశవరావు, తక్కెళ్లపాడు వాసుదేవరావు ఉన్నట్లుగా సమాచారం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే మృతుల పేర్లు, ఫోటోలు విడుదల చేయాలని, ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ వారు చేశారు.

Advertisement

Next Story

Most Viewed