- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దయచేసి అలాంటి ప్రచారం చేయొద్దు.. మాకు సూపర్ స్టార్ ఆరోగ్యమే ముఖ్యం: లోకేష్ కనగరాజ్
దిశ, సినిమా: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతున్నారు. ప్రజెంట్ ఆయన లోకేష్ కనగరాజ్‌తో ‘కూలీ’ మూవీ చేస్తున్నారు. అలాగే టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన వెట్టైయాన్ అక్టోబర్ 10న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో రజినీకాంత్ అనారోగ్యానికి గురై హాస్పిటల్‌లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఓ సర్జరీ చేయించుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రజెంట్ ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. అయితే రజినీకాంత్ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా కూలీ చిత్రబృందం షూటింగ్ చేయించుకున్నట్లు పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో.. లోకేష్ కనగరాజ్ స్పందించి ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. ‘‘సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. వాటిని చూస్తుంటేనే నాకు చాలా బాధగా ఉంది. దయచేసి అలాంటి ప్రచారం చేయొద్దు. దాదాపు నెల రోజుల క్రితం వైజాగ్ షెడ్యూల్‌లో ఉన్నప్పుడు రజినీకాంత్ ఆరోగ్యం గురించి మాకు చెప్పారు. ఓ సర్జరీ చేయించుకోవాల్సి ఉందన్నారు. అప్పుడే మేము సెప్టెంబర్ 28 వరకు ఆయనకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేశాం.
30న ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. నేను ఆయనతో మాట్లాడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాను. సూపర్ స్టార్ ఆరోగ్యం కంటే మాకు షూటింగ్ ముఖ్యం కాదు. కాబట్టి ఏదైనా రాసేటప్పుడు దానిపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలు రాయండి అని నేను కోరుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు.