Trump advice: ఇరాన్ అణు స్థావరంపై దాడి చేయాల్సిందే.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ సలహా

by vinod kumar |   ( Updated:2024-10-05 09:15:58.0  )
Trump advice: ఇరాన్ అణు స్థావరంపై దాడి చేయాల్సిందే.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ సలహా
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ క్షిపణి దాడికి ప్రతీకారంగా ఆ దేశ అణు స్థావరంపై ఇజ్రాయెల్ దాడి చేస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. నార్త్ కరోలినాలో తాజాగా జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇరాన్‌లోని అణ్వాయుధ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేస్తే అమెరికా మద్దతివ్వబోదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రకటనను ట్రంప్ ట్రంప్ విమర్శించారు. బైడెన్ వాదన సరికాదని, అణ్వాయుధాలు అతిపెద్ద ముప్పు అని తెలిపారు. ఇరాన్ ఎక్కువ సంఖ్యలో వీటిని కలిగి ఉంటే అమెరికాకు సమస్యలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఇరాన్ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ మొదట దాడి చేయాలని మిగిలిన దాని గురించి తర్వాత ఆలోచించాలని సూచించారు.

కాగా, ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ ఇజ్రాయెల్‌పై సుమారు 200 క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. అనంతరం ప్రతీకారంగా ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేయబోతుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.దీనిపై స్పందించిన బైడెన్ ఇరాన్‌లోని అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేస్తే అమెరికా మద్దతివ్వబోదని ప్రకటించారు. ఈ విషయమై నెతన్యాహుతో మాట్లాడతానని జీ7 దేశాల సమావేశంలో తెలిపారు. ఈ నేపథ్యంలోనే బైడెన్ పై వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed