- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 175లకే 12ఓటీటీలు..జియో ధమాకా
దిశ, వెబ్ డెస్క్ : ఒక్కో వెబ్ సిరీస్..సినిమాలు ఒక్కో ఓటీటీలో విడుదలవుతున్న క్రమంలో వినియోగదారులు తాము కోరుకున్న సినిమాలు..సిరీస్ లను చూడాలంటే ఆర్థిక భారానికి గురవుతున్నారు. ఇలా ఇబ్బంది పడుతున్న వారి కోసం రిలయన్స్ జియో రెండు నూతన ప్లాన్ ల రీఛార్జ్ అవకాశాన్ని కల్పిస్తోంది. అది కూడా ఏకంగా 12ఓటీటీలను చూసే అవకాశం కల్పిస్తూ భారీ ప్రయోజనం అందిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న రెండు ప్లాన్ లలో రిలయన్స్ జియో సబ్ స్కెబర్లకు జియోటీవీ ప్రీమియం ప్లాన్లు రూ.500 కంటే తక్కువ ధరకే అందించబడుతున్నాయి. మొదటి ప్లాన్ ధర రూ. 175తో రీఛార్జ్ చేస్తే, మీరు 28 రోజుల చెల్లుబాటుతో అదనపు డేటాను పొందుతారు. ఈ ప్లాన్ 10జీబీ అదనపు డేటాతో ఓటీటీ ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే దీనితో రీఛార్జ్ చేస్తే, కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. కేవలం ఈ ప్లాన్ ఓటీటీ సేవలకు యాక్సెస్ ఇస్తోంది.
కచ్చితంగా డజను ఓటీటీలతో పాటు రోజువారీ డేటా కావాలంటే, రూ.448 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో 28 రోజుల చెల్లుబాటుతో 2జీబీ రోజువారీ డేటా లభిస్తుంది. ఇది కాకుండా, అన్ని నెట్వర్క్ లలో అపరిమిత కాలింగ్ చేయవచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు పంపే అవకాశం ఉంది. ఇందులో మునుపటి ప్లాన్ తో పోలిస్తే మరో రెండు ఓటీటీ సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 12 ఓటీటీలకు యాక్సెస్ ఇవ్వబడుతోంది. సోనీ లైవ్, జీ5, జీయో సినిమా ప్రీమియం, సన్ నెక్స్టు, డిస్కవరీ ప్లస్ సహా మొత్తం 12 ఓటీటీ సేవలు లభిస్తాయి.