- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఓన్లీ 5 మినిట్స్’.. దశాబ్ధి వేడుకల్లో సోనియా స్పీచ్ టైమ్ ఫిక్స్..!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు చీఫ్‌గెస్ట్‌గా హాజరవుతున్న ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఐదు నిమిషాల పాటు ప్రసగించే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సెలబ్రేషన్ స్టేజ్‌పై నుంచి ఎలాంటి రాజకీయ విమర్శలు లేకుండానే స్పీచ్ ఉండనున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిన అవసరం, యూపీఏ 1, 2లో పార్టీ తీసుకున్న నిర్ణయాలు వంటివి వివరించనున్నారు. కరీంనగర్‌లో ఇచ్చిన ప్రామిస్‌తో పాటు రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై ఆమె మాట్లాడనున్నట్లు తెలిసింది. ఇప్పటికే స్పీచ్ కాపీ రెడీ కాగా, సదరు కాపీ ట్రాన్స్ లేటర్‌కు అందించేందుకు పార్టీ ప్రోటోకాల్ విభాగం ఆలోచిస్తున్నది. అయితే సోనియా గాంధీ ఏం మాట్లాడతారు..? ఏం సందేశం ఇవ్వబోతున్నారు..? అని ప్రజలతో పాటు కాంగ్రెస్ లీడర్లు, రాజకీయ నాయకుల్లోనూ ఉత్కంఠ నెలకొన్నది.