- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Prof Haragopal: విద్యతోనే సామాజిక చైతన్యం: ప్రొఫెసర్ హరగోపాల్
దిశ, తెలంగాణ బ్యూరో : విద్యతోనే సామాజిక చైతన్యం సాధ్యమని, అదే సామాజిక అభివృద్ధికి తోడ్పడుతుందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ చక్రధర్ రావు అధ్యక్షతన బుధవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధి కోసం రాష్ట్ర బడ్జెట్ లో 20 శాతం నిధులు కేటాయించేటట్లు మేధావులు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ విద్యావిధానాలు ప్రజలకు అనుకూలంగా ఉంటే విద్య ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరగుతాయన్నారు. అట్టడుగు వర్గాల సామాజిక హోదాను కూడా పెంచుతుందని వివరించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్లు బీఆర్ఎస్ పాలనలో విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని హరగోపాల్ విమర్శలు చేశారు. విద్యారంగానికి క్రమంగా నిధులు తగ్గించుకుంటూ వచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యకు 2.66 శాతం, యూజీసీ గ్రాంట్స్ 60 శాతం నిధులు తగ్గించడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో విద్యకు కేటాయింపులు పెంచలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో కనీసం 20 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వై అశోక్ కుమార్, నాయకులు నాగిరెడ్డి, ఎం సోమయ్య, నారాయణ, కిష్టప్ప, రవిచందర్, జంగయ్య తదితరులు ఉన్నారు.