సీసాలో పాము విషం.. విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Rajesh |   ( Updated:2023-05-02 02:55:11.0  )
సీసాలో పాము విషం.. విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ నుంచి భారత్ కు అక్రమంగా రవాణా చేస్తున్న పాము విషాన్ని బీఎస్ఎఫ్ దళాలు పట్టుకున్నాయి. పక్కా సమాచారం అందుకున్న భద్రతా దళాలు భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దులో కాపు కాసి ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు స్మగ్లర్లు ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నించారు. కాల్పులు జరపడంతో స్మగ్లర్లు పారిపోయారు. అయితే వారు తమ వెంట తెచ్చిన పాము విషాన్ని పోలీసులు కనుగొన్నారు.

సీసా మీద మేడ్ ఇన్ ఫ్రాన్స్ అని రాసి ఉందని అధికారులు తెలిపారు. బాటిల్ లో ఉన్న పాము విషయం కోబ్రాదని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఆ సీసాను ఫారెస్ట్ ఆఫీసర్లకు అందించారు. అయితే ఈ పాము విషం ధర రూ.13 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే పాము విషం అక్రమ రవాణా ఒక్కసారిగా కలకలం రేపింది. ఎవరికి సరఫరా చేసేందుకు తీసుకొచ్చారనే విషయంపై భద్రతా అధికారులు ఆరా తీస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed