- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Smitha Sabarwal: ఓయూలో దివ్యాంగ విద్యార్థుల నిరసన..! స్మిత సబర్వాల్ ఫోటోలు దగ్ధం!
దిశ, డైనమిక్ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీలోని దివ్యాంగ విద్యార్ధులు ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఫోటోలను దగ్ధం చేశారు. తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ రెండు రోజుల క్రితం యూపీఎస్సీలో దివ్యాంగుల కోటాపై సంచలన వ్యాఖ్యలు చేయగా.. దీనిపై తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఓయూ ఆర్ట్స్ కళాశాల భవనం ముందు దివ్యాంగ విద్యార్ధులు స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. ఆమె దివ్యాంగులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ పై పలు నినాదాలు చేస్తూ.. ఆమె ఫోటోలను దగ్దం చేశారు. అంతేగాక ప్రభుత్వం ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగా రెండు రోజుల క్రితం స్మితా సబర్వాల్.. దివ్యాంగులకు గౌరవం ఇవ్వాల్సిందే అంటూనే.. అఖిల భారత సర్వీసుల్లో దివ్యాంగుల కోటా ఎందుకు అని ప్రశ్నిస్తూనే.. డెస్క్ లో ఉండే ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని అన్నారు. అలాగే ఒక పైలట్ గా దివ్యాంగులను తీసుకుంటారా అని, వైకల్యం ఉన్న సర్జన్ ను విశ్వసిస్తారా అని ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతోంది. స్మిత సబర్వాల్ వ్యాఖ్యలపై దివ్యాంగుల ఐక్య సంఘాలు, దివ్యాంగులతో పాటు పలు రాజకీయ నాయకులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.