- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Smita Sabharwal Tweets: ఎంపీ వర్సెస్ స్మితా సబర్వాల్.. ట్విట్టర్ వేదికగా దుమారం.. అసలేం జరిగిందంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: అఖిల భారత సర్వీస్ ఉద్యోగాలకు ఎంపిక విషయంలో గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. నకిలీ వైకల్యం సర్టిఫికెట్ తో సివిల్స్ సర్వీస్ జాబ్ లో ప్రవేశించారని పూజా ఖేద్కర్ అనే ట్రైనీ ఐఏఎస్ అధికారిణి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ లో దివ్యాంగుల కోటా అంశం చర్చనీయాశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కేడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ దివ్యాంగుల రిజర్వేషన్ల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దివ్యాంగులకు గౌరవం ఇవ్వాల్సిందే అంటూనే అత్యంత కీలకమైన అఖిల భారత సర్వీసులలో వారికి కోటా ఎందుకని ప్రశ్నించారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో అఖిల భారత సర్వీస్ నిబంధనలపై సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆదివారం ఆమె చేసిన వరుస ట్వీట్లు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. సివిల్స్ నియామకాల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా కింద రిజర్వేషన్లు అవసరం లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో పని చేయాల్సిన ఉద్యోగాల్లో కోటా ఎందుకని డెస్క్ లో పని చేసే ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని సూచించారు. యూపీఎస్సీ చైర్మన్ పదవికి మనోజ్ సోనీ రాజీనామా చేయడంపై స్పందిస్తూ.. బాధ్యత లేకుండా ఎలా రాజీనామా చేస్తారని ప్రశ్నించారు. అవకతవకలు తేల్చకుండా తప్పించుకోలేరంటూ పోస్టు చేశారు. స్మితా సబర్వాల్ ట్వీట్లపై సామాన్య నెటిజన్లతో పాటు పలువురు పలువురు ప్రముఖులు విభిన్న రీతుల్లో రియాక్ట్ అవుతున్నారు. కొంత మంది నెటిజన్లు సమర్థిస్తుంటే మరికొంత మంది విభేదిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో అనేక మంది నెటిజన్లకు స్మితా రిప్లయ్ లు ఇవ్వడం ఆసక్తిగా మారింది. దీంతో ఈ డిబేట్ వ్యవహారం ఎటువైపు దారి తీస్తుందో అనేది మరింత ఉత్కంఠ రేపుతున్నది.
వైకల్యం ఉన్న పైలట్‌ను ఎయిర్‌లైన్లు నియమించుకుంటారా?:
'వైకల్యం ఉన్న వారిని గౌరవిస్తున్నాను.. సివిల్ సర్వీస్ ఉద్యోగాలైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉద్యోగాల స్వభావం ఫీల్డ్ వర్క్, ఎక్కువ సమయం కేటాయించడం, ప్రజల మనోవేదనలు నేరుగా వినాల్సి ఉంటుంది. దీనికి శారీరక దృఢత్వం అవసరం. వైకల్యం ఉన్న పైలట్‌ను ఎయిర్‌లైన్స్ నియమించుకుంటుందా? లేదా మీరు వైకల్యం ఉన్న సర్జన్‌ని విశ్వసిస్తారా? అని స్మితా ట్వీట్టర్ వేదికాగ ప్రశ్నించారు. ఈ ట్వీట్ కు ఓ నెటిజన్ స్పందిస్తూ అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల పిల్లలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి అని కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన ఆమె.. ఇవ్వకూడదు అని బదులిచ్చారు. మరో నెటిజన్ స్పందిస్తూ నేను లోకోమోటర్ డిజేబుల్డ్ మరియు అంప్యూటీని. నేను ఒంటరిగా 4 దేశాలు తిరిగాను. నేను దక్షిణాది రాష్ట్రాలన్నీ తిరిగాను. అలాగే నేను వ్యాపారం నడుపుతున్నాను, నేను డ్రైవ్ చేస్తున్నాను, నేను ఈత కొడుతున్నాను. నేను ఊతకర్రలతో నడుస్తాను. కానీ మోడ్రన్ డేస్ ఐఏఎస్, ఐపీఎస్ లు చాలా మంది సేవలో లేరు. వారు తమను తాము రాజులుగా, రాణులుగా పరిగణించుకుంంటూ సివిల్ సర్వెంట్లమని మరచి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని కామెంట్ చేశారు. ఇందుకు హ్యాట్సాప్ అని స్మితా సబర్వాల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ అంటూ రిప్లయ్ ఇచ్చారు.
అవగాహన లేని మాటలు..
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఎన్.కరుణ స్పందిస్తూ.. వైకల్యం గురించి ఐఏఎస్ ఆఫీసర్ కు అవగాహన లేదని విమర్శించారు. చాలా వైకల్యాలు శక్తిసామర్థ్యాలు, తెలివితేటలపై ప్రభావం చూపవు. కానీ మీ ట్వీట్ జ్ఞానోదయం, వైవిధ్యం చాలా అవసరం అని చూపిస్తుందని స్పందించారు. ఈ కామెంట్ పై రియాక్ట్ అయిన స్మితా సబర్వాల్.. 'మేడం నాకు ఉద్యోగ అవసరాల గురించి ప్రాథమిక అవగాహన ఉంది. ఇక్కడ సమస్య గ్రౌండ్ జాబ్ కు అనుకూలత గురించి . డెస్క్/థింక్ ట్యాంక్ స్వభావం వంటి ప్రభుత్వంలోని ఇతర సేవలు బాగా సరిపోతాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. దయచేసి ముగింపు వెళ్లవద్దు. సమానత్వ హక్కుల కోసం మొత్తం రక్షణ కోసం చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ ఉంది. అక్కడ ఎలాంటి చర్చ లేదు' అని బదులిచ్చారు.
పూర్తిగా చదవండి.. మహిళా ఎంపీకి స్మితా కౌంటర్:
స్మితా సబర్వాల్ లేవనెత్తిన అంశాలపై శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది స్పందించారు. ఇది చాలా దయనీయమై వినహాయింపు కలిగిన అభిప్రాయం అని విమర్శించారు. బ్యూరోక్రాట్ లు తమ పరిమితమైన ఆలోచనలను వారి ప్రత్యేకాధికారాలను ఎలా చూపిస్తున్నారనేదానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. ప్రియాంక వ్యాఖ్యలకు స్పందించిన స్మితా సబర్వాల్ .. మేడం బ్యూరోక్రాట్లు పాలనకు సంబంధించిన సమస్యలపై మాట్లాడకపోతే ఎవరు మాట్లాడుతారు అని ప్రశ్నించారు. నేనేమి పరిమిత అనుభవంతో మాట్లాడటం లేదు. 24 ఏళ్ల నా ఉద్యోగ అనుభవంతోనే నా ఆలోచనలను, ఆందోళనలను పంచుకున్నాను. దయచేసి పూర్తిగా చదవండి. ఇతర కేంద్ర సేవలతో పోలిస్తే ఐఏఎస్ కు భిన్నమైన డిమాండ్లు ఉన్నాయి. ప్రతిభావంతులైన వైకల్యం కలిగిన వారు కచ్చితంగా గొప్ప అవకాశాలు పొందవచ్చు అంటూ రిప్లయి ఇచ్చారు. మొత్తంగా స్మితా సబర్వాల్ లేవనెత్తిన తాజా అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.