Smita Sabharwal: సివిల్స్ మెంటర్ బాలలత సవాల్‌ను స్వీకరించిన స్మిత సబర్వాల్.. కానీ..

by Mahesh |
Smita Sabharwal: సివిల్స్ మెంటర్ బాలలత సవాల్‌ను స్వీకరించిన స్మిత సబర్వాల్.. కానీ..
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా ఉండే.. ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్.. వివాదంలో చిక్కుకున్నారు. ఆలిండియా సివిల్ సర్వీసెస్‌లో దివ్యాంగుల కోటా అవసరమా అంటూ ఆమె ఓ ట్వీట్ చేశారు. ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్వీట్ పై రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె వ్యాఖ్యలపై CSB IAS అకాడమీ చీఫ్, మెంటర్ బాలలత తీవ్ర స్థాయిలో స్పందించారు. సివిల్స్ సర్వీసెస్‌లో దివ్యాంగుల కోట అంశంపై స్పందించేందుకు కోర్టులు, చట్టసభలు ఉన్నాయంటూ ఆమె ఫైర్ అయ్యారు. ఇది స్మితా సబర్వాల్ ఆలోచనా.. లేక తెలంగాణ ప్రభుత్వ ఆలోచన చెప్పాలని ప్రశ్నించారు. అలాగే స్మిత సబర్వాల్ దమ్ముంటే తనతో పాటు ఎగ్జామ్ లో పోటీ పడాలని.. సవాల్ విసిరారు. ఈ సవాల్ పై స్పందించిన ఐఏఎస్ స్మితా.. బాలలత స్వీకరిస్తున్నాను.. కానీ తన వయస్సు దాటిపోవడంతో యూసీఎస్ సీ నిబంధనలు ఒప్పకొవంటై ట్వీట్ చేశారు. అలాగే బాలలత నా ప్రశ్నకు సమాధానమివ్వాలి.. మీరు దివ్యాంగ రిజర్వేన్లను ప్రజలకు ఫీల్డ్ వర్క్ కోసం వినియోగించారా లేక కోచింగ్ సంస్థలు నడిపేందుకు వాడారా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మరి ఈ ప్రశ్నకు సివిల్స్ మెంటర్ బాలలత ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed