Smita Sabharwal: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్మితా సబర్వాల్ రియాక్షన్

by Prasad Jukanti |
Smita Sabharwal: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్మితా సబర్వాల్ రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలను టాలీవుడ్ ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఈ క్రమంలో మంత్రి వ్యాఖ్యలపై సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు, సంచలనం అయ్యేందుకు మహిళలను టార్గెట్ చేయడం బాధాకరం అన్నారు. అధికారులను కూడా వదిలిపెట్టడం లేదని వ్యక్తిగత అనుభవంతో తాను మాట్లాడుతున్నానన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చూసిన నేను షాక్ అయ్యానని ఆమె వ్యాఖ్యలు గౌరవప్రదంగా లేవన్నారు. ప్రతిది రాజకీయం చేయడం సరికాదని ప్రజా జీవితంలో ఆరోగ్యకరమైన వ్యాఖ్యలు ఉండాలన్నారు. మహిళలు, కుటుంబాలు, సామాజిక కట్టుబాట్లు గౌరవించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story