SLBC: ఎస్ఎల్‌బీసీ వద్ద కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్.. రంగంలోకి దిగనున్న ‘మార్కోస్’

by Shiva |
SLBC: ఎస్ఎల్‌బీసీ వద్ద కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్.. రంగంలోకి దిగనున్న ‘మార్కోస్’
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్ఎల్‌బీసీ (SLBC)లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు SDRF, NDRF, ఆర్మీ బృందాలు నిరంతరం రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) కొనసాగిస్తున్నాయి. సొరంగంలో 12 నుంచి 13 ఫీట్ల ఎత్తు వరకు బురద నీరు నిండి ఉండటంతో సహయక చర్యలు మందకొడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ మెరెయిన్ కమాండో ఫోర్స్ (Indian Marine Commando Force) (మార్కోస్) రంగంలోకి దింపనుంది. అయితే, నేల, నీరు, ఆకాశం‌లో కూడా రెస్క్యూ‌లు చేసే టీమ్ మార్కోస్ కలిసి SDRF, NDRF, ఇంజనీర్లు (Engineers) రెస్క్యూ‌ ఆపరేషన్‌లో పాల్గొననున్నారు.

అయితే, ఎస్ఎల్‌బీసీ (SLBC) నాలుగో రోజు రెస్క్యూ ఆపరేషన్‌ (Rescue Operation)లో భాగంగా మొత్తం నాలుగు ముఖ్యమైన ఆపరేషన్లు చేపట్టబోతున్నారు. మొదటగా లోనికి వెళ్లేందుకు లూజ్ అయిన కన్వేయర్ బెల్టు (Conveyor Belt)ను పునరుద్ధరించనున్నారు. అనంతరం ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ మిషన్ (Tunnel Boring Machine) విడి భాగాలను కట్టర్స్ సాయంతో కట్ చేసి బయటకు తీయనున్నారు. అదేవిధంగా ఊటల నుంచి ఊబికి వస్తున్న నీటిని భారీ మోటార్ల సాయంతో బయటకు పంప్ చేయనున్నారు. కానీ, నీటిని తొలగిస్తే మరింత ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చివరగా బురదను డీసిల్టింగ్ (Desilting) చేస్తూ ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నం చేయనున్నారు. ప్రస్తుతం ప్రమాద జరిగిన స్థలానికి 15 మీటర్ల దూరంలోనే రెస్క్యూ బృందాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

Next Story

Most Viewed