SLBC Rescue Operation : SLBC ప్రమాదం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

by M.Rajitha |
SLBC Rescue Operation : SLBC ప్రమాదం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
X

దిశ, వెబ్ డెస్క్ : మహబూబ్ నగర జిల్లాలో శ్రీశైలం లెప్ట్​బ్యాంక్ కెనాల్​(SLBC) టన్నెల్ లో కొంతభాగం కుప్పకూలిన ఘటన(SLBC Tunnel Incident)లో 8 మంది కార్మికులు టన్నెల్ లో చిక్కుకున్న విషయం తెలిసిందే. రెండు రోజులుగా టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ప్రమాద స్థలానికి వెళ్ళి వచ్చిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttham Kumar Reddy), జూపల్లి కృష్ణారావు(Jupalli KrishnaRao) అక్కడి భీతావాహ దృశ్యాలను చూసి ఆందోళన చెందారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు(NDRF Team), నేవీ(Navy), ఆర్మీ బృందాలు(Army Team), ప్రత్యేక రెస్క్యూ టీం రంగం(Rescue Teams)లోకి దిగి కార్మికులను బయటికి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తోంది.

టన్నెల్ మార్గంలో 11వ కిమీ నుంచి 2 కిమీల వరకు భారీగా నీరు, బురద నిలిచి పోయింది. బురద, నీటి వలన సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అధికారులు తెలియజేశారు. అయినప్పటికీ ఆదివారం రాత్రి రెస్క్యూ టీమ్స్ దాదాపు 100 మీటర్ల వరకు బురదలో నడిచి లోపలికి వెళ్ళాయి. అక్కడ భారీ మోటార్లను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వాటి సహాయంతో లోపల నిలిచిన నీటిని బయటికి తోడనున్నారు. అలాగే నేడు ఢిల్లీ నుంచి ర్యాట్ హోల్ మైనర్స్(Rat Hole Minors) ను ప్రమాద స్థలానికి రప్పించింది రాష్ట్ర ప్రభుత్వం. వీరు ఎంతటి కఠినమైన పరిస్థితులు ఉన్నా రాళ్ళను తొలుస్తూ లోపలికి వెళ్లగలరు. టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిరంతరం సమీక్షిస్తున్నారు.

Next Story